చేయి తడపందే ఫైలుకు మోక్షం రాదు
నర్సీపట్నం ముచ్చట్లు:
రైతులు సాగు చేసుకున్న చెట్లను అమ్ముకునేందుకు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు… దీనిపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పునరాలోచించాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. అయ్యన్న మాట్లాడుతూ చేయి తడపందే రెవెన్యూ అధికారులు చెట్లను లెక్కించడం లేదు. అనుమతించేందుకు అటవీశాఖ అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్ దగ్గర్నుంచి డిఎఫ్వో వరకు చేయి తడపందే ఫైలు ముందుకు కదలడం లేదు. దీనిపై కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దృష్టిసారించాలి… వీలైనంత తక్కువ సమయంలో అనుమతిచ్చి రైతులకు సహకారం అందించాలని అయన అన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Salvation does not come to the file that touches the hand