Natyam ad

పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత ‘యశోద’ చిత్రం!!

హైదరాబాద్ ముచ్చట్లు:

ఫస్ట్ గ్లింప్స్ తోనే అంచనాలు భారీగా పెంచేసిన సమంత ‘యశోద’ చిత్రం షూటింగ్ ఒక సాంగ్ మినహా టాకీ మొత్తం పూర్తయింది. శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నం.14 గా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం  వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘’సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్ తో మా యశోద చిత్రాన్ని 100 రోజుల్లో పూర్తి చేశాం. సాంగ్ మినహా టాకీ షూట్ మొత్తం పూర్తయింది. ఒకవైపు గ్రాఫిక్స్ పని జరుగుతుండగా  ఈ నెల 15 నుండి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నాం ఆ వెంటనే ఇతర భాషల డబ్బింగ్ కూడా జరుగుతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో కుడా అదే స్థాయిలో చేయబోతున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియన్ చిత్రంగా విడుదల చేయడానికి ‘యశోద’ పూర్తిగా సిద్ధమాయ్యాకే మంచి తేదీ చూసుకుని కొత్త విడుదల తేదీ ప్రకటిస్తాము. అలాగే రానున్న రోజుల్లో చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్ విడుదల మరియు ఇతర వివరాలు తెలియజేస్తాము. సమంత ‘యశోద’ పాత్రని సొంతం చేసుకున్న తీరు చూస్తే చాలా గర్వంగా ఉంది. చాలా ఏకాగ్రతతో, పూర్తి డెడికేషన్ తో యాక్షన్ మరియు ఇతర సన్నివేశాలు అద్భుతంగా చేసింది. సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతుంది. నటీ నటులు, సాంకేతిక నిపుణులు అందరూ చిత్రం అద్భుతంగా వచ్చేలా సహకరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్రాన్ని పూర్తిగా సిద్ధం చేస్తున్నాం’’ అని చెప్పారు.
సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సంగీతం: మణిశర్మ

 

Post Midle

Tags: Samantha’s ‘Yashoda’ film has completed shooting except for the song!!

Post Midle

Leave A Reply

Your email address will not be published.