సంపూర్ణేష్‌ బాబు పెద్ద మనసు!

హైదరాబాద్ ముచ్చట్లు:

 

హీరో సంపూర్ణేష్‌ బాబు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, వారిని చదివించేందుకు ముందుకొచ్చారు. చిన్న సినిమాలు చేసే హీరో అయినప్పటికీ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు తనకు తోచిన సాయం చేస్తుంటారు సంపూ. తాజాగా దుబ్బాకకు చెందిన నరసింహచారి దంపతులు అప్పు బాధలతో ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరూ కూమార్తెలు దిక్కులేని వారిగా మారారు. ఈ వార్త చూసి సంపూర్ణేష్‌ చలించిపోయారు. తక్షణమే వారి వివరాలు తెలుసుకుని రూ. 25 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా తెలిపారు. ప్రస్తుతం సంపూ.. ‘బజారు రౌడీ, ‘క్యాలీఫ్లవర్‌’, ‘పుడింగి నంబర్‌ వన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Sampoornesh Babu has a big mind!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *