Samudra 'Jai Sena' teaser released by King Nagarjuna !!

కింగ్‌ నాగార్జున విడుదల చేసిన స‌ముద్ర ‘జై సేన’ టీజర్!!

Date:23/12/2019

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం టీజర్‌ను డిసెంబర్‌ 23న కింగ్‌ నాగార్జున విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు సముద్ర, నటులు కార్తికేయ, ప్రవీణ్‌, శిరీష్‌ రెడ్డి, హరీష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ – ”ముందుగా సముద్రకి ఆల్‌ ది బెస్ట్‌. ఆయన స్టోరీ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం వహించిన ‘జై సేన’ త్వరలో విడుదలవుతుంది. ‘జైసేన’ టీం అందరికి పేరు పేరునా ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు. దర్శకుడు సముద్ర మాట్లాడుతూ – ”శివమహాతేజ ఫిలిమ్స్‌లో నిర్మించిన చిత్రం ‘జై సేన’. హీరో సునీల్‌, గోపిచంద్‌, నాగబాబు విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పుడు నాగార్జునగారు టీజర్‌ను విడుదల చేశారు. అంతకన్నా మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నాం.

 

 

 

 

 

 

 

నా మీద ఉన్న అభిమానంతో టీజర్ రిలీజ్ చేసిన నాగార్జున గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరి అభిమానులు, రెండు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘జైసేన’. మా సినిమాకి అందరి ఆశిస్సులు ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు. శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌ పరిచయం అవుతున్నారు. అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార్వతిచందు, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్‌, డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కనల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, కెమెరా: వాసు, కో ప్రొడ్యూసర్స్‌: పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.సముద్ర.

 

గ్రీవెన్ సెల్ ఆకస్మిక తనిఖీ చెసిన కలెక్టర్ హోళికేర్

 

Tags:Samudra ‘Jai Sena’ teaser released by King Nagarjuna !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *