Natyam ad

కులమతా పార్టీలకతీతంగా సీఎం సహాయనిధి మంజూరు.. ఎమ్మెల్యే శ్రీదేవమ్మ  

క్రిష్ణగిరి ముచ్చట్లు:

క్రిష్ణగిరి మండలం టిడిపి మాజీ మండల అధ్యక్షుడు కంబాలపాడు కే.ఈ మద్దిలేటి అనారోగ్యంతో మృతిచెందగా సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 2 లక్షల 50 వేల రూపాయల చెక్కును కె.ఈ మద్దిలేటి కుమారుడు భాస్కర్ గౌడ్ కు పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ గారు కర్నూల్ స్వగృహం నందు   అందజేశారు. ప్రత్యేక చొరవ చూపి సీఎం సహాయనిధి మంజూరు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శ్రీదేవమ్మ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. క్రిష్ణగిరి మండల ఎంపీపీ డాక్టర్ వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Sanction of CM’s relief fund irrespective of caste parties.. MLA Sreedevamma

Post Midle