సీతానగరంలో చెలరేగుతున్న ఇసుక మాఫియా

రాజమండ్రి  ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం సింగవరం కైలాసగిరి ఇసుక ర్యాంపు నుండి యదేచ్చగా అక్రమ బొండు ఇసుకతో పాటు ఇసుక అనధికారికంగా తరలిపోతుంది. అధికార పార్టీ నేతల కనుసందళ్ళోనే ఇదంతా తరలి పోతుందనే ఆరోపణలు ఉన్నాయి. బొండు ఇసుక తీసుకు వెళ్లాలంటే సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. తాసిల్దార్,మైన్స్ అధికారుల అనుమతి తప్పనిసరి కానీ,ఈ బొండు ఇసుక మాఫియా రకరకాల సాకులు చెప్పి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు మెరక వేయడానికి అంటూ వీఆర్వోలకు చేతులు తడుపుతున్నారనే ఆరోపణలు ప్రజల్లో గుప్పుమంటున్నాయి. అక్రమ మార్గాన్ని సక్రమం చేసే మార్గంగా నియోజకవర్గ నాయకులు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. ఈ మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేసే వారిపై దాడులు చేయడానికైనా వెనుకాడటం లేదని గ్రామస్తులు అంటున్నారు. ప్రభుత్వ అధికారులు ఎటువంటి అనుమతులు జారీ చేయకుండానే రాత్రి పగలు రోడ్డు పక్క ప్రాంతాల వారికి నిద్ర లేకుండా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రెవిన్యూ ఆర్.ఐ  గానీ,పోలీస్ అధికారులు గానీ ఏ పర్మిషన్లతో ఈ బొండు ఇసుక రవాణా చేస్తున్నారనే అడిగిన దాఖలాలు కనబడటం లేదని ప్రజలు అంటున్నారు. ఉచితంగా రాజన్న స్థలాల కంటూ మాయ మాటలు చెపుతూ దళారులు లక్షల రూపాయల సొమ్ములు చేసుకుంటున్నారని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా రోజురోజుకూ ఈ ఇసుక మాఫియా ఎక్కువైపోతుంది అని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మాఫియా ఆగడాలను నిలుపుదల చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు..

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Sand mafia erupting in Sitanagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *