శ్రీగంధం చెక్కలు… ఆయిల్ మాయం

-విచారణ చేపట్టిన అధికారులు
 
అనంతపురం ముచ్చట్లు:
 
శ్రీగంధం చెక్కలు… ఆయిల్ మాయం అయిన సంఘటన పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే మడకశిర మండలం లోని బసనహల్లి గ్రామం వద్ద గత ఏడాది ఆగస్ట్ 13న అక్రమంగా నిలువ ఉంచిన 188 సంచుల శ్రీగంధం చెక్కలు, శ్రీ గంధం ఆయిల్ సీజ్ చేసి పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో నిల్వ ఉంచారు. అటవీ శాఖ కార్యాలయంలో భద్రపరచిన 92 సంచుల శ్రీగంధం చెక్కలు, 16 కిలోల శ్రీగంధం ఆయిల్ చోరీకి గురైంది. అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం తనిఖీలు నిర్వహించగా చోరీ జరిగిన విషయం బయటపడింది. గతంలో పెనుకొండ  అటవీశాఖ కార్యాలయంలో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలు, పట్టుబడిన వాహనం మాయమైన ఘటన మరువక ముందే తాజాగా  70లక్షల రూపాయలకు పైగా విలువచేసే శ్రీగంధం చెక్కలు, ఆయిల్ మాయమవటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై జిల్లా శాఖ అధికారి సందీప్ కృపాకర్ విచారణ చేపట్టారు.పూర్తి వివరాలు అధికారుల పరిశీలనలో తేలాల్సి ఉంది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Sandalwood sticks … ate oil

Natyam ad