సందీప్ కిషన్, విఐ ఆనంద్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ ‘ఊరు పేరు భైరవకోన’ నుంచి లవ్ అండ్ పెప్పీ మెలోడీ హమ్మా హమ్మా పాట విడుదల
హైద్రాబాద్ ముచ్చట్లు:
హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ రెండవ సారి కలిసి చేస్తున్న ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించగా మొదటి సింగిల్ ‘నిజమే నే చెబుతున్నా’ వైరల్ హిట్ అయ్యింది. ఈరోజు, మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా, మేకర్స్ రెండవ పాట- హమ్మా హమ్మా ను విడుదల చేశారు. ఇది లీడ్ పెయిర్- సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మపై చిత్రీకరించిన బ్యూటీఫుల్, పెప్పీ నంబర్.వర్ష బొల్లమ్మతో గాఢమైన ప్రేమలో ఉన్న సందీప్ కిషన్ ఆమె పట్ల తన భావాలను పాటలో అందంగా వ్యక్తం చేశారు. సందీప్ కిషన్ ఉత్సాహంగా కనిపించగా, వర్ష అందంగా ఉంది. వీరిద్దరూ కలిసి ముచ్చటగా కనిపించారు. శేఖర్ చంద్ర, తిరుపతి జవానా సాహిత్యం అందించగా, రామ్ మిరియాల తన అద్భుతమైన వాయిస్ తో అదనపు ఎనర్జీని తీసుకువచ్చారు. పాటలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.వ్య థాపర్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.
తారాగణం: సందీప్ కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ తదితరులు

Tags: Sandeep Kishan, VI Anand, AK Entertainments release Love and Peppy Melody Hamma Hamma song from comedy movie ‘Uru Parama Bhairavakona’
