రెండు గ్రామాలు మధ్య ఇసుక తుఫాను

విజయనగరం ముచ్చట్లు:
 
రెండు గ్రామాల మధ్య మొదలైన ఇసుక వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఎంతలా అంటే.. బడికి వెళ్లే పిల్లలను సైతం రోడ్డుపైనే నిలబెట్టేసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో చోటుచేసుకుంది. ఇరు గ్రామాల ప్రజలు మీరా, మేమా అంటూ పోలీసుల ముందే ఘర్షణకు దిగుతున్నారు. మీ గ్రామం నుంచి వచ్చే నాటు బండ్లను మేం అపుతామంటే.. మీ ఊరు నుంచి వచ్చే వెహికిల్స్ మేం ఆపేస్తామంటూ పంతాలకు వెళ్తుండటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గందిగెడ్డ ప్రాంతంలో ఏర్పడిన ఈ వివాదం శాంతిభద్రతల సమస్యగా మారడంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. లంకలపల్లి పాలెం సమీపంలో ఉన్న కందిగెడ్డ వద్ద ఇళ్ల నిర్మాణానికి గోవిందపురం గ్రామస్తులు నాటుబండ్ల సహయంతో ఇసుక తెచ్చుకుంటున్నారు. ఇది కొన్నాళ్లుగా సాగుతోంది. సడెన్‌గా ఒకరోజు.. తమ గ్రామం మీదుగా ఇసుక తీసుకెళ్ళటానికి వీల్లేదంటూ గోవిందపురం గ్రామస్తులను లంకలపల్లిపాలెం గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గోవిందపురం గ్రామస్తుల ఇసుక రవాణాకు ఇబ్బందిగా మారింది.దీంతో లంకలపల్లి పాలెం వాసులపై ప్రతీకార చర్యలకు దిగారు గోవింపురం వాసులు. మా ఊరి మీదుగా వెళ్లే మీ వెహికల్స్‌ను నిలిపేస్తామని హెచ్చరించారు. తాగునీటి సరఫరాను అడ్డుకున్నారు. దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. రెండు గ్రామాల మధ్య సయోధ్య కుదిర్చి ఇసుక తరలింపు కోసం ఒప్పందం కుదిర్చారు. ఈ క్రమంలో కొద్దిరోజులకే మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. లంకలపల్లి వాసులు మాట తప్పారంటూ.. ఈసారి గోవిందపురం గ్రామస్తులు తమ ఊరి నుంచి వెళ్తున్న స్కూల్ బస్సును, వాహనాలను నిలిపివేశారు. అసలు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో వివాదం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరు గ్రామాల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకొని మాటల యుద్ధానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
 
Tags: Sandstorm between two villages

Leave A Reply

Your email address will not be published.