మంజీరా నదిలో ఇసుక తుఫాను
నిజామాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ, మహారాష్టల్ర మధ్య ఉన్న మంజీరా నదిపై మహారాష్ట్ర కుట్రలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో ఉన్న ఇసుక నిలువలు దోచుకుపోయేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో క్వారీల ఏర్పాటుకు మహా సర్కారు అడ్డగోలుగా అనుమతులు ఇస్తుండగా.. క్వారీలు దక్కించుకున్న వారు మరో అడుగు ముందుకేసి ఈ నది పూర్తిగా మహారాష్టక్రు సంబంధించినదే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం తన వాటా కింద ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చి క్వారీలు ఏర్పాటు చేస్తుంటే మహా క్వారీల నిర్వాహకులు అడుగడుగునా అడ్డు తగులుతూ క్వారీలు తెరుచుకోకుండా వ్యవహరిస్తున్నారు. అక్కడి ప్రజలను రెచ్చగొడుతూ తెలంగాణ అధికారులు, క్వారీ నిర్వాహకుల పైకి ఉసి గొలుపుతున్నారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఖండ్‌గాం గ్రామ శివారులో గల మంజీరాలో చోటుచేసుకున్న పరిస్థితులే ఇందుకు అద్దం పడుతున్నాయి. ఈ విషయంలో బోధన్ రూరల్ పోలీసులు సకాలంలో స్పందించి మహా క్వారీల కుట్రలను వ్యూహాత్మకంగా తిప్పికొట్టారు. సాయంత్రం ఐదు గంటల నుండి అర్ధరాత్రి వరకు మంజీరా నదిలో హైడ్రామా చోటుచేసుకుంది.
ఇందులో బోధన్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గోవర్దనగిరి, రూరల్ ఎస్సై అశోక్‌రెడ్డిలు వ్యూహాత్మకంగా వ్యవహరించి మరాఠా పోలీసుల సహకారంతో అక్కడి రెవెన్యూ అధికారులకు వాస్తవాలు వెల్లడించడంతో మహా క్వారీ నిర్వాహకుల కుట్రలు పటాపంచలయ్యాయి. ఖండ్‌గాం శివారులో గల మంజీరా నదిలో తెలంగాణ సర్కారు అనుమతులతో సర్కారు క్వారీని ప్రారంభించేందుకు టీఎస్‌ఎండీసీ అధికారులు, క్వారీ నిర్వాహకులు మంజీరా నదిలోకి వెళ్లగా మహారాష్ట్ర ప్రజలు తిరగబడింది. అలాగే, ఈ ప్రాంతానికి చెందిన 210 మిషన్‌లను వాటి ఆపరేటర్లను సైతం వారు తమ వెంట తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న బోధన్ రూరల్ పోలీసులు సాయంత్రం ఆరు గంటలకు అదనపు బలగాలతో మంజీరానది వద్దకు తరలివచ్చారు. అప్పటికే ఇసుక తవ్వకాలు జరిపే మిషన్‌లు మహారాష్టల్రో ఉన్నటువంటి మాచునూర్ క్వారీ వద్దకు తరలించుకుపోయారు తెలంగాణ భూబాగంలో నుండి తీసుకెళ్లిన 210 మిషన్‌ను మంజీరా నదిలో ఉన్నటువంటి మహా భూభాగంలో పెట్టి అక్కడ వాటి ఫోటోలు తీసి మహారాష్ట్ర రెవెన్యూ అధికారులకు అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని సమాచారం అందించినట్లు పోలీసులకు తెలిసింది.

Tags: Sandstorm on the Manjira River
