Natyam ad

పుంగనూరులో ముమ్మరంగా పారిశుద్ద్య కార్యక్రమాలు

పుంగనూరు ముచ్చట్లు:
 
మున్సిపాలిటి పరిధిలోని 16 సచివాలయాల్లోను శానిటేషన్‌ కార్యక్రమాలను నిర్వహించినట్లు కమిషనర్‌ రసూల్‌ఖాన్‌ తెలిపారు. శుక్రవారం చైర్మన్‌ అలీమ్‌బాషా తో కలసి సచివాలయాల్లో శానిటైజర్లు స్ప్రే చేయించామన్నారు. అలాగే మురుగునీటి కాలువల్లోని పూడికలను తొలగించి, కంపోస్ట్ యార్డుకు తరలిస్తున్నామన్నారు. దోమలు ప్రభలకుండ ఫాగింగ్‌ చేస్తున్నామన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా పట్టణ ప్రజల ఇంటి వద్దకు వెళ్లి సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు , కౌన్సిలర్లు కలసి ప్రజలలో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముఖ్యంగా మాస్క్ లు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం , అనవసరంగా సంచరించడంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సురేంద్రబాబు, కార్మికులు పాల్గొన్నారు.

పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Sanitation activities in full swing in Punganur