సవాల్ గా మారుతున్న పారిశుద్ధ్యం

వరంగల్ ముచ్చట్లు:
 
అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగనుంది. అయితే, ఇప్పటికే భారీ సంఖ్యలో భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు. భక్తులు పెద్ద ఎత్తున మేడారానికి వస్తున్నారు. ఇదిలాంటే.. మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి విచ్చేస్తున్న భక్తులు.. అమ్మవార్లకు మొక్కలు చెల్లించిన తరువాత మేక, కోడి సహా ఇతర వ్యర్థాలను ఎక్కడ పడితే వేస్తున్నారు. అడవిలో చెట్ల మీద, గుడి ఆవరణలో ఇష్టారీతిన వ్యర్థాలను పడేస్తున్నారు. ఇప్పుడిదే పెద్ద సమస్యగా మారింది.భక్తులకు ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి.. ఈ పరిస్థితిని గమనించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించిన తరువాత మేక, కోడి సహా ఇతర వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ అడవిలో చెట్ల మీద కానీ గుడి ఆవరణలో పడేయకండని నమస్కరించి మరీ విజ్ఞప్తి చేశారు. ఆ వ్యర్థాల కారణంగా తరువాత వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగుతుందన్నారు. జాతర ముగిసిన తరువాత ఈ వ్యర్థాల కారణంగా చుట్టు పక్కల గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా, కలరా వంటి విష జ్వరాలు విజృంభించే ప్రమాదం ఉందని భక్తులకు సూచించారు. ఈ నేపథ్యంలో వ్యర్థాలను చెత్త కుండీల్లో మాత్రమే వేయాలని, పరిశుభ్రతను పాటించి.. గిరిజన ప్రజలు వ్యాధుల బారిన పడుకుండా సహకరించాలని ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి చేశారు.సవాల్‌గా పారిశుద్ధ్య నిర్వహణ.. మేడారం జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ అధికారులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. కారణం భక్తుల నిర్లక్ష్యమే అని అధికారులు వాపోతున్నారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా కోళ్లు, మేకలు, గొర్లను వధించి వ్యర్థాలను పడేయడంతో పరిసరాలు దుర్గంధంగా మారాయని అంటున్నారు. ఈ వ్యర్థాల కారణంగా ఈగలు, దోమలు సైతం విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 
ఇంటికే అమ్మవారి ప్రసాదం
ఆసియాలోనే అతి పెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు ఘనంగా చేసింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే మేడారం జాతరకు సామాన్యులు, సెలబ్రేటీలు క్యూలు కడుతున్నారు. ఈ నేపధ్యంలో మేడారం సమ్మక్క సారలమ్మ వారి ప్రసాదంను ఆర్టీసీ, తపాలా శాఖల ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో డోర్ డెలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుందని ఆయన తెలిపారు.అమ్మవారి ప్రసాదంను డోర్ డెలివరీ చేసేందుకు ఇండియన్ పోస్టల్, ఆర్టీసీ, ఐటీ శాఖల సేవలను వినియోగించు కోనున్నమని మంత్రి  తెలిపారు. అమ్మవారి ప్రసాదం నేరుగా పొందలేని వారికి… భారత పోస్టల్ సర్వీసు , ఆర్టీసీ కొరియర్ సర్వీస్ ద్వారా తమ ఇంటికే చేరవేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తుల ఆర్డర్ మేరకు ఇంటి నుంచే బెల్లం- బంగారం ప్రసాదం అమ్మవారికి సమర్పించే వారి కోసం కూడా ఆర్టీసీ సంస్థ భక్తుల ఇంటికి వచ్చి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించి మళ్లీ దాన్ని భక్తులకు అందేజేయనున్నట్లు వెల్లడించారు. ఆన్ లైన్ లో మీ సేవ లేదా టీయాప్ ఫోలియో TAPP-FOLIO (మొబైల్ ప్లే స్టోర్ డౌన్ లోడ్ చేసుకుని )లో బుక్ చేసుకోవాలన్నారు. అనంతరం భక్తులకు పోస్టల్ సేవల ద్వారా అమ్మవారి ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు. ఈ సేవలకు గాను ఒక ప్రసాదం ప్యాకెట్ కు భక్తులు రూ. 225 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 200 గ్రాముల బెల్లం ప్రసాదం, పసుపు కుంకుమ, అమ్మవారి ఫోటో ను భక్తులకు ఇంటి వద్ద అందజేస్తామన్నారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఇంటికే ప్రసాదం అందించనున్నామని.. ఈ సేవలను భక్వితులు నియోగించుకోవాలని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి కోరారు.
 
Tags: Sanitation is becoming a challenge

Leave A Reply

Your email address will not be published.