Natyam ad

దుర్గగుడి దసరా ఉత్సవాల్లో శానిటేషన్  కష్టాలు

విజయవాడ ముచ్చట్లు:


దసరా ఉత్సవాల నేపధ్యంలో దుర్గగుడి దలో శానిటేషన్  కష్టాలు తలెత్తాయి. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల సమయంలో 250 మందిని అదనంగా పారిశుద్ధ్య సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటారు. ఈ దసరా ఉత్సవాల్లో  ఈవో భ్రమరాంబ 130  మందిని మాత్రమే  శా నిటేషన్ విభాగంలోకి అదనంగా తీసుకున్నారు. ఇంద్రకీలాద్రి  పరిసర ప్రాంతాల్లో  ఎక్కడ పడితే అక్కడ చెత్తా , చెదారం  తో నిండిపోవడం పై కలెక్టర్ ఢిల్లీ రావు ఆరా తీసారు. చెత్తాచెదారాన్ని ఎందుకు తొలగించడం లేదని ఈవో భ్రమరామను అయన ప్రశ్నించారు.
మరోవైపు, తన సొంత నిర్ణయాలతో దుర్గ గుడికి వచ్చే భక్తుల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారని ఈవో పై భక్తుల విమర్శలు వెల్లువెత్తాయి. ఈవో నిర్లక్ష్య వైఖరి పై అధికార పార్టీ నేతలు కుడా ఆరా తీసారు. ఇటీవల పలువురు. పారిశుధ్య విభాగ సిబ్బంది తమకు దుర్గగుడి ఈవో నెలవారి ఇచ్చే జీతాలను  చాలా ఆలస్యంగా చెల్లిస్తున్నారని  తమను పలువురు అధికారులు తమ ఇంటి వద్ద పని చేయించుకుంటున్నారని అధికార పార్టీ నేతలు వద్ద చెప్పి తమ ఆవేదన తెలియజేశారు. ఈ విషయంపై ఈవో  భ్రమరాంబ ను  అధికార పార్టీ నేతలు ప్రశ్నించడంపై దుర్గగుడివో ఈవో పారిశుధ్య సిబ్బందిని   ఇబ్బందులకుగురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. నేటి వరకు( సెప్టెంబర్ 29వ తేదీ వరకు) కిందటి నెల (ఆగస్టు) జీతం ఈవో భ్రమరాంబ తమకు ఇవ్వలేదని దుర్గ గుడి పారిశుధ్య సిబ్బంది అంటున్నారు.

 

Tags: Sanitation problems during Durga Gudi Dussehra celebrations

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.