యుద్ధప్రాతిపదికన పారిశుధ్యపనులు

Sanitation sanctions

Sanitation sanctions

-సమీక్షా భేటీలో మంత్రి లోకేష్
Date:13/10/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక కార్యక్రమాల పై పంచాయతీ రాజ్,గ్రామీణ తాగునీటి సరఫరా,గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
శనివారం ఉదయానికి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 19 మల్టీ విలేజ్ తాగునీటి పథకాల దగ్గరకు జనరేటర్లు చేరుకునన్నాయి. 19 పెద్ద తాగునీటి పథకాలను వేగంగా వినియోగంలోకి తీసుకువచ్చారు. ఇప్పటికే తిత్లీ ప్రభావిత 377 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభమయింది. నీటి సరఫరాకి అందుబాటులో ఉన్న అగ్నిమాపక వాహనాలను సైతం వినియోగిస్తున్నారు. అన్ని గ్రామల్లో తాగునీటి పథకాలు వినియోగంలోకి రావాలి.
తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న  116 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు వెంటనే మరమ్మతులు చెయ్యాలని మంత్రి ఆదేశించారను. సాయంత్రం  లోపు అన్ని గ్రామాల్లో రోడ్ల పునరుద్ధరణ చెయ్యాలి. తాత్కాలిక మరమ్మతులు పూర్తి చెయ్యాలి. గ్రామాల్లో అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా పారిశుధ్య పనులు వేగవంతం చెయ్యాలని అన్నారు.
గ్రామాల్లో చెత్త కుప్పల తొలగింపు,మురుగు కాలువల పూడికతీత,పొదలతొలగింపు, రహదారుల పరిశుభ్రత, బ్లీచింగ్, దోమల నివారణకు ఫాగింగ్ అన్ని గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అయన అన్నారు. ఇప్పటికే ఇతర జిల్లాల నుండి సిబ్బంది తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు. వెంటనే పనులు ప్రారంభించి సాయంత్రం లోపు ఒక దఫా పారిశుధ్య పనులు పూర్తి చెయ్యాలని మంత్రి  సూచించారు.
Tags: Sanitation sanctions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *