పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి 

Date;23/09/2020

– కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు

 

పారిశుద్య సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ యంవి రెడ్డి మున్సిపల్ , పంచాయతీ అధికారులను ఆదేశించారు . పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటుకు వ్యర్థాలు తొలగించడం , బ్లీచింగ్ , సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం ప్రే చేయడం వల్ల అనారోగ్యానికి గరయ్యే అవకాశాలున్నాయని క్రమం తప్పక ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు . మన ఇళ్ళ నుండి వెలువడే వ్యర్థాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తూ ఆరోగ్యవంతమైన సమాజానికి వారు చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని చెప్పారు . పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణకు సిబ్బంది రక్షణ చర్యలు పాటించేందుకు కావాల్సిన వస్తువులను అందజేయాలన్నారు  . పారిశుద్య కార్మికుల జీతభత్యాలు నిర్వహణకు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా రిజిష్టరు నిర్వహించాలని , ప్రతి నెలా నికర వేతనం , మినహాయింపులు రిజిష్టరులో నమోదులు చేసి సిబ్బందికి అందచేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు . పారిశుద్య సిబ్బంది జాబితాను అందచేయాలని , వచ్చే వారం నిర్వహించే వీడియో కాన్ఫరెన్సులో సిబ్బంది సంరక్షణకు అందిస్తున్న సేవలు , సమస్యలు తదితర అంశాలను నేరుగా తెలుసుకోవడం జరుగుతుందని ఎక్కడైనా అలసత్వం వహిస్తున్నట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు . పని చేయించుకోవడమే కాదు ఎంతో ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యోగక్షేమాలు కూడా చాలా ముఖ్యమని చెప్పారు . సమాజ పరిరక్షణలో వారందిస్తున్న సేవలు ఎంతో అమూల్యమైనవని , వారిని చిన్న చూపు చూడకుండా వారి పట్ల గౌరవ భావంతో మెలగాలని చెప్పారు .

 

పారిశుద్య సిబ్బంది అని చూడకుండా మన సంరక్షణ కోసం పాటుపడుతున్న మంచి సేవకులుగా వారిని గుర్తించి మంచి గౌరవాన్ని అందించాలని ఆయన సూచించారు . క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ రిజిష్టరు నిర్వహించాలని చెప్పారు . పారిశుద్య సిబ్బందికి వేతనాలు చెల్లింపుల్లో కమిషన్లు తీసుకోవడం , నిర్దేశించిన వేతనం కన్నా తక్కువ చెల్లింపులు చేయడం చేస్తే క్రిమినల్ కేసులు నమోదులు చేయాలని చెప్పారు . ఏజన్సీల ద్వారా చెల్లింపులను క్రమం తప్పక పర్యవేక్షణ చేయాలని , వారికి చెల్లించే జీత భత్యాల వివరాలు సమగ్రంగా తెలుసుకోవడానికి క్రమం తప్పక నమోదులతో పాటు ప్రతి ఒక్కరికి రిజిష్టరు నిర్వహించాలని చెప్పారు . కరోనా , అంటువ్యాధుల , నియంత్రణలో పరిసరాలు పరిశుభ్రత చాలా ముఖ్యమని ముందునుండి పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం వల్ల నేడు అంటు వ్యాధులను చాలా వరకు తగ్గించగలాగామని చెప్పారు . ప్రజలు కూడా ఇంటి వస్తున్న వ్యర్థాలను విచక్షణా రహితంగా ఎక్కడ పడితే అక్కడ చేయకుండా చెత్తబుట్టల్లో వేసి పారిశుద్య సిబ్బందికి అందచేయాలని చెప్పారు . ఆరుబయట వేయడం వల్ల దోమలు , ఈగలు వ్యాప్తి చెంది అంటువ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉంటుందని ప్రతి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో తమ వంతు బాధ్యతను తీసుకోవాలని చెప్పారు . మున్సిపాలీ పరిధిలో నాటుతున్న మొక్కల సంరక్షణకు సేవకులను నియమించుకోవాలని మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు . 600-700 మొక్కలకు ఒక సేవకుని నియమించుకోవడానికి అనుతిస్తున్నట్లు చెప్పారు . నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని చెప్పారు .

 

మున్సిపాల్టీలకు హరితహారంలో నిర్దేశించిన లక్ష్యాలను ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని చెప్పారు . మున్సిపాల్టీలలోని డివైడర్లు ఎత్తు పెంచి అందమైన మొక్కలు నాటాలని చెప్పారు . మున్సిపాల్టీలలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమగ్ర నివేదికలు అందచేయాలని , ప్రారంభం కాని పనులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు . అభివృద్ధి పనులు మంజూరు చేసి రెండేళ్లు గడిచినా ఎందుకు చేపట్టలేదని కొత్తగూడెం , పాల్వంచ మున్సిపల్ కమిషనర్లుపపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షో కాజ్ నోటీసు జారీ చేయాలని , పనులు పర్యవేక్షణ చేయాల్సిన ఏఈ , డీఈలు సకాలంలో పనులు చేపట్టలేకపోయారో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లుకు షో కాజ్ నోటీసులు జారీ చేయాలని , పనులు దక్కించుకుని చేపట్టని కాంట్రాక్టర్లును  బ్లాక్ లిస్టులో పెట్టి మున్ముందు జిల్లాలో ప్రభుత్వ పనులు చేపట్టకుండా  చేయాలన్నారు .

 

ఎల్ ఆర్ ఎస్ పేరుతో ప్రజల నెత్తిన గుదిబండ

Tags:Sanitation staff should take steps to maintain health

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *