పారిశుధ్య  కార్మికుల నిరసన

Date:25/05/2019

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా వింజమూరులో పారిశుధ్య  కార్మికులు  పంచాయితీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. వింజమూరు పట్టణంలో సుమారు 30 మందికి పైగా  పారిశుధ్య కార్మికులుగా  కాంట్రాక్టుపద్ధతిన  పని చేస్తున్నామని గత 5 నెలలుగా  మాకు జీతాలు ఇవ్వలేదన్నారు. చాలీ చాలని జీతాలతో   పనిచేస్తుంటే  ఇంతవరకు జీతాలు  ఇవ్వకపోవడం  చాల దారుణమన్నారు. పేదలమైన  మాకు ఇల్లు గడవడం  చాలా కష్టంగా ఉందని జీతాలు ఇవ్వమని అధికారులను కోరారు. అధికారులు బెదిరించి  దౌర్జన్యం  చేశారన్నారు. మాకు పదివేలకు  జీతాలు పెరిగినా  ఏడువేల  ఇస్తున్నారని, మాకు జీతాలు పెంచాలని , మాపై దౌర్జన్యం చేసిన అధికారి పై చర్యలు తీసుకోవాలన్నారు  లేదంటే కార్మికులందరం  ఐక్యంగా విధులను బహిష్కరించి నిరాహారదీక్షకు దిగుతామని అన్నారు.

పేదలకు భూములకోసం పోరాటం

 

Tags:  Sanitation workers protest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *