Natyam ad

కోవిడ్ కేర్ సెంటర్ పద్మావతి నిలయంలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె…

తిరుపతి ముచ్చట్లు:
శ్రీ పద్మావతి నిలయం లో పారిశుద్ధ్య కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ధర్నా నిర్వహించారు. కొవిడ్ సమస్య ఉదృతంగా ఉన్నప్పటికీ కార్మికులు వారి ప్రాణాలను లెక్కచేయకుండా పారిశుద్ధ్యానికి ఏ లోపం కలగకుండా  సేవలు చేసినటువంటి కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో వారి జీవనాధారం చాలా కష్టంగా జీవితం గడపాల్సి వస్తుంది ఇందుకు కార్మికులంతా కలిసి ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొన్నారు ఇందులో ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి పి .మురళి ,సిపిఐ నగర కార్యదర్శి జె విశ్వనాథన్. నియోజకవర్గ అధ్యక్షుల n. శ్రీ రాములు, కార్యదర్శి n . చంద్రశేఖర్ రెడ్డి. శ్రీ శ్రీనివాస పద్మావతి కాంట్రాక్టర్స్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం శివ, అధ్యక్షులు ఎస్ సుభాన్ కార్యదర్శి పి సుజాత, కౌసల్య ,నాగ ముని లక్ష్మి ,చంద్రబాబు ,ఆదిలక్ష్మి మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags; Sanitation workers strike at Kovid Care Center Padmavati Nilayam …