పుంగనూరులో సంక్రాంతి సందడి
పుంగనూరు ముచ్చట్లు:
నూతన సంక్రాంతిని పురస్కరించుకుని పట్టణంలోని పలు పాఠశాలల్లో సంక్రాంతి మందుస్తు సంబరాలు నిర్వహించారు. బుధవారం పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. అలాగే శ్రీకృష్ణారెడ్డి చైతన్య ప్రిన్సిపాల్ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి , విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొంగళ్లు తయారి చేసి, సంక్రాంతి పాటలతో తెలుగుతనం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.

Tags: Sankranthi buzz in Punganur
