కర్నూలు లో  సంక్రాంతి సంబరాలు

– DYFI, AIDWA, PNM

Date:16/01/2021

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలు నగరంలో 43 వ వార్డు ఇందిరా గాంధీ నగర్ లో ఆటలు పాటలు,ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఇందిరా గాంధీ నగర్ లో DYFI,AIDWA,PNM  ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుండి ఘనంగా ఆటల పాటల పోటీలు నిర్వహించి ప్రజలందరూ సంతోషంగా సంక్రాంతి సంబరాలు చేసుకునేలా నిర్వహిస్తున్నామని తెలియజేశారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న CPM జిల్లా కార్యదర్శి K.ప్రభాకర్ రెడ్డి మరియు సిఐటియు జిల్లా అధ్యక్షులు పి ఎస్ రాధాకృష్ణ , DYFI మాజి జిల్లా అద్యక్ష లు మాజీ కార్పొరేటర్ T.రాముడు, ఐద్వా  జిల్లా నాయకురాలు J.కిరణ్ మయి , డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేష్ మాట్లాడుతూ ఆటల పోటీలు ముగ్గుల పోటీలు,డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్న  ఉత్సాహంతో  రైతన్నలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో అస్తి విలువపై ఇంటి పన్ను వేసే విధానం రద్దు కోసం, ధరల పెరుగు దలపై, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, పేద మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వమే నాణ్యమైన విధ్య నందించే లాగా, ప్రజలందరికీ ప్రభుత్వం నాణ్యమైన వైద్యం అందించే లాగా రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ స్పోర్ట్స్ జిల్లా కన్వీనర్ శంకర్ డివైఎఫ్ఐ నగర కార్యదర్శి రాఘవేంద్ర డివైఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు హుస్సేన్ భాష, డివైఎఫ్ఐ నాయకులు రవి విక్రమ్ మ్, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు లోకేష్ , నోమేస్వారీ, కెవిపిఎస్ నాయకులు భాస్కర్, రోసన్న  , ఐద్వా, డివైఎఫ్ఐ ,పి ఎన్ ఎం కార్యకర్తలు పాల్గొన్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags:Sankranthi celebrations in Kurnool

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *