పుంగనూరు మున్సిపాలిటిలో సంక్రాంతి సంబరాలు

– మహిళలచే ముగ్గులు, వంటల పోటీలు
 
పుంగనూరు ముచ్చట్లు:
 
నూతన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను మేళవింపు చేసేలా పండుగను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో కమిషనర్‌ రసూల్‌ఖాన్‌ ఏర్పాట్లు నిర్వహించారు. ముఖ్యఅతిధులుగా ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం హాజరైయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయం ఆవరణంలో మహిళలు అత్యంత సుందరంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. అలాగే వంటల పోటీలు నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగశోభ సంతరించుకుంది. పొంగళ్లు తయారు చేసి, బోగిమంటలు వెలిగించారు. ఎడ్లబండికి, పశువులకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, సిఆర్‌.లలిత, కౌన్సిలర్లు కాంతమ్మ, అమ్ము, నరసింహులు, రేష్మా, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, ఇంతియాజ్‌, రాజేష్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Sankranthi celebrations in Punganur Municipality

Natyam ad