తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి

Sankranthi in Telugu states

Sankranthi in Telugu states

Date:14/01/2019
ఏలూరు ముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సోమవారం తెల్లవారుజామునే మంటలు వేసి భోగికి స్వాగతం పలికిన ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. సంక్రాంతి అంటే భోగి మంటలు, కొత్తబట్టలు, పిండి వంటలు, ఎడ్ల పందేలేనా?. అవే కాదు అసలైనవి మరొకటి ఉంది.. అవే కోడి పందేలు. సంక్రాంతి వస్తుందంటే నెల రోజుల ముందు నుంచి గోదావరి జిల్లాలో సందడి మొదలైపోతుంది. ముఖ్యంగా పందేల కోసం కోళ్లను సిద్ధం చేసుకుంటారు పందెం రాయుళ్లు. సంక్రాంతి పండుగ వచ్చేయడంతో ఇక కోళ్ల పందేలకు తెరదీశారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా భారీస్థాయిలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగానే కోడి పందేలకు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. కోడి పందేలతో గతేడాది ఏకంగా వేయి కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలకు పందేలు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. కోడి పందేలపై చూసీచూడనట్లు వ్యవహరించాలని ప్రజాప్రతినిధుల నుంచి పోలీసులకు ఒత్తిళ్లు వస్తున్నాయట. ఈ పందేలు చూడటానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో గోదావరి జిల్లాలకు తరలివస్తున్నారు. ఉభయగోదావరితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు కోడి పందేలు విస్తరించాయి. ఈసారి ఒక్కో జిల్లాలో భారీ పందేలు వేసేలా 10-15 బరులు, చిన్న పందేలు వేసుకునేలా 500-600 బరులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. చిన్న బరుల్లో రూ.5వేల నుంచి లక్ష రూపాయల వరకు, పెద్ద బరుల్లో రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు పందేలు కడుతున్నారు. దీనికి తోడు కోడి పందేల పక్కనే గుండాట, పేకాట, కోతాటలు కూడా నిర్వహిస్తుండటంతో భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయి.
Tags:Sankranthi in Telugu states

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *