మున్సిపాలిటిలో సంక్రాంతి సందడి

Sankranthi in the municipality

– మహిళలచే వంటలు, ముగ్గుల పోటీలు
– విజేతలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి బహుమతులు
– పోటీలలో పాల్గొన్న వారికి సాక్షి బహుమతులు

Date:11/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

నూతన సంక్రాంతిని పురస్కరించుకుని తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ , వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం మహిళలకు పిండివంటల తయారీ, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా పోటీలలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నగదు బహుమతి అందజేశారు. అలాగే పోటీలలో పాల్గొన్నవారికి సాక్షి తెలుగుదినపత్రిక ఆధ్వర్యంలో ఒకొక్కరికి రూ.500లు చొప్పున నగదు బహుమతిని అందజేశారు. ఈ పోటీలలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 13 గ్రూపుల మహిళలల్లో పిండి వంటల తయారీలో పాల్గొన్నారు. ఈ పోటీలలో విజేతలను ఎంపిక చేసేందుకు డాక్టర్లు సరళ, లక్ష్మిసంగీత, ప్రిన్సిపాల్‌ మంజులారెడ్డితో పాటు కౌన్సిలర్లు దివ్యలక్ష్మి, లలితరాణి, మాజీ కౌన్సిలర్‌ కాంతమ్మ , ప్రముఖ మహిళలు సుశీలమ్మ, శిల్పనరేంద్రలు న్యాయనిర్ణీతలుగా వ్యవహరించారు. పోటీలను పరిశీలించి , వారి మార్కులు ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. వంటల పోటీలలో ప్రధమ విజేత అనురా, ద్వితీయ బహుమతి మంజుల, మూడవ బహుమతి వాహిదా,అలాగే ముగ్గుల పోటీలలో వెహోదటి బహుమతి ఉషా, రెండవ బహుమతి సరళ, మూడవ బహుమతి మంజుల కు నగదు బహుమతులను వైఎస్సాఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం అందజేశారు. అలాగే మున్సిపాలిటిలోని వివిధశాఖ అధికారులు వెంకట్రామయ్య, క్రిష్ణారావు, మనోహర్‌, ప్రసాద్‌, రమణారెడ్డి తదితరులకు మెమెంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మను పట్టణ ప్రజలందరు కలసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రేష్మా, మంజుల, త్యాగరాజు, మనోహర్‌, అమ్ము, ఇబ్రహిం, ఆసిఫ్‌, రెడ్డిశేఖర్‌, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

రాయలసీమ చిల్డ్రన్స్అకాడమిలో….

పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్అకాడమిలో డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ మంజులారెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో సాంప్రదాయ రీతిలో ముగ్గులు వేసి, బోగిమంటలు వేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ కెఎల్‌.వర్మ, వైఎస్సాఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్ప, డాక్టర్లు చైతన్యతేజారెడ్డి, లక్ష్మిసంగీత పాల్గొన్నారు.

రెండో రోజు నష్టాల్లోనే మార్కెట్లు

Tags; Sankranthi in the municipality

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *