కృష్ణ చైతన్యలో సంక్రాంతి సంబరాలు- ముగ్గుల పోటీలు.

నెల్లూరు  ముచ్చట్లు:
 
స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్ ప్రాంతంలో ఉన్న కృష్ణ చైతన్య కళాశాల ప్రాంగణంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు జరిగాయి. అందులో భాగంగానే విద్యార్థినీలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్  పాయసం మహేష్ మాట్లాడుతూ కృష్ణ చైతన్య కళాశాలల డైరెక్టర్లు ఆర్ వి కృష్ణారెడ్డి, పి.చంద్రశేఖర్ రెడ్డి లు విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక కార్యక్రమాలలోనూ తర్ఫీదు ఇచ్చేందుకు సహకారం అందిస్తున్నారని వారి సేవలను కొనియాడారు. ఇందులో భాగంగానే గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో నిర్వహించ లేకపోయినా ముగ్గుల పోటీలను 2022 సంక్రాంతి సంబరాలను గుర్తు చేసుకుంటూ, విద్యార్థినీలను ప్రోత్సహించే దిశగా ముగ్గుల పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ శిరీష, అకడమిక్ డీన్ రాం గోపాల్ రెడ్డి,అడ్మిన్ డీన్ జి.ఉమ తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Sankranthi Sambara in Krishna Chaitanya- Mughal competitions.

Natyam ad