చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయం లో సంక్రాంతి సంబరాలు

తెలుగు సంప్రదాయ దుస్తుల్లో ఎడ్ల బండి పై వెళ్లిన ఎస్పీ పాటిల్
పోలీస్ కుటుంబాలతో సంక్రాంతి సందడి

Date:13/01/2019

చిత్తూరు ముచ్చట్లు:

మునుపెన్నడూ లేని విదంగా చిత్తూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆయన సతీమణి సాంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు హాజరయ్యారు. పోలీసులందరూ సాంప్రదాయ దుస్తుల్లో కుటుంబ సంభ్యులతో కలిసి ముగ్గుల పోటీలు పొంగళ్ళు తయారు చేసి పంచడం నిర్వహించారు. ఎస్పీ పాటిల్ ఎడ్ల బండి పైకి ఎక్కి జాటి ఝుళిపిస్తూ పర్యటించారు. సాంప్రదాయ రీతిలో పోలీస్ ప్రధాన కార్యాలయం అత్యంత సుందరంగా అలంకరించి తెలుగు తనాన్ని ప్రతిబింబించేలా చేశారు. పరస్పరం శుభాకాంక్షలతో సరదాగా కాలక్షేపం చేశారు.

తెదేపా పాలనలో ప్రజల మనస్సుల్లో నిలిచిపోయే అభివృద్ధి

Tags:sankranti celebrates Chittoor district police office

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *