మార్లపల్లె చర్చిలో సంక్రాంతి పండుగ
పుంగనూరు ముచ్చట్లు:
నూతన సంవత్సర సంక్రాంతి వేడుకలను మండలంలోని మార్లపల్లె గ్రామస్తులు ఆదివారం చర్చిలో ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులందరు కలసి పశువులను అలంకరించారు. తమకు ఇష్టమైన సినిమా హీరోల బొమ్మలు , బెలూన్లు పశువులకు కట్టి ఊరేగింపుగా చర్చికి తీసుకొచ్చారు. చర్చిలో కానుకమాతకు పూలమాలలు వేశారు. పాదర్ డాక్టర్ విల్సన్రెడ్డి ప్రార్థనలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. గ్రామస్తులు మేళతాళాలతో పశువులను ఊరేగింపు నిర్వహించి , కాటమరాజు గుడి వద్ద చిట్లాకుప్ప వెలిగించి , బలులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజప్ప, గ్రామస్తులు మోహన్‌రెడ్డి, నాగభూషణం, శంకర్‌రెడ్డి, శంకర, ఆంటోనిరాజ్, హరినాథరెడ్డి, రంగ, ఆంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags; Sankranti festival at Marlapalle Church
