సన్నాఫ్ ఆఫ్ శ్రీ హరి రీల్ ఎంట్రీ

Date:21/05/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుల్లో రియల్ స్టార్ శ్రీహరి ఒకరు. విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఇలా అన్ని రకాల పాత్రలు చేసిన నటుడు శ్రీహరి. మంచి పాత్రలు చేస్తూ ఓ వెలుగు వెలుగుతోన్న దశలో దురదృష్టవశాత్తు ఆయన మన్నుంచి దూరంగా, తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. శ్రీహరి ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన్ని మాత్రం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. శ్రీహరి, డిస్కో శాంతి దంపతులకు ఇద్దరు కుమారుల సంతానం. వీరిలో పెద్ద కుమారుడు మేఘాంశ్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌‌లో మేఘాంశ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో కార్తిక్‌, అర్జున్‌ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. లక్ష్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎంఎల్‌వీ సత్యానారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘రాజ్‌ధూత్’ అనే టైటిల్‌ను ఖరారుచేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు. కాగా, స్టంట్‌ ఫైటర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తరవాత నటుడిగా ఎదిగారు శ్రీహరి. ఎన్నో చిత్రాల్లో నటించి ‘రియల్‌ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడుతూ సీరియస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. 1991లో ఆయన సినీ నటి డిస్కో శాంతిని వివాహం చేసుకున్నారు. వీరికి మేఘాంశ్, శశాంక్ ఇద్దరు కుమారులు. 2013 అక్టోబర్‌లో ముంబైలో ఓ హిందీ సినిమా షూటింగ్‌లో ఉండగా శ్రీహరి గుండెపోటుతో కన్నుమూశారు.

 

ఇంటి టెర్రాస్ పై 40 రకాల మామిడి పండ్లు

 

Tags: Sannaf of Sri Hari Reel Entry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *