‘వజ్ర కవచధర గోవింద’ చిత్రంలో హీరోగా సప్తగిరి

Saptagiri is the hero in 'Vajra Kavachadhara Govinda'

Saptagiri is the hero in 'Vajra Kavachadhara Govinda'

Date:02/01/2019
స్టార్ కమెడియన్‌గా రాణిస్తూ ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ రూట్‌ని ఏర్పరుచుకున్నారు సప్తగిరి. ఆయన హీరోగా  ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’   తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ పవార్ డైరెక్షన్‌లో శివ శివమ్ ఫిలింస్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఓ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వజ్ర కవచధర గోవింద’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ.. ”ఈ కథకు కరెక్ట్ టైటిల్ ఇది. ఇందులో సప్తగిరి పాత్ర పేరు గోవిందు. ఇతనొక ఫన్నీ దొంగ. ఇతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం అతనేం చేశాడన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, మంచి యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు కూడా ఇందులో బాగా కుదిరాయి.
సప్తగిరి బాడీ లాంగ్వేజ్‌కి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇది” అని చెప్పారు. నిర్మాతలు  నరేంద్ర యెడల  , జీవిఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ”సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ లాంటి సూపర్ హిట్ తర్వాత సప్తగిరి, అరుణ్ పవార్ కాంబినేషన్‌లో సినిమా చేసే అవకాశం మాకు దక్కడం చాలా హ్యాపీగా ఉంది. ఇదొక హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇప్పటికి 60 శాతం చిత్రం పూర్తయింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం” అని తెలిపారు. వైభవీ జోషీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు . ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: ప్రవీణ్ వనమాలి, ఎడిటింగ్: కిషోర్ మద్దాలి,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాలన బాలగోపాలరావు.
Tags:Saptagiri is the hero in ‘Vajra Kavachadhara Govinda’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *