Natyam ad

హరినామ స్మరణతో మార్మోగిన సప్తగిరులు- వైభవంగా శ్రీకృష్ణ శ్లోక పారాయణం

తిరుపతి ముచ్చట్లు:

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల నాద నిరాజనం వేదికపై బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ కృష్ణ శ్లోక పారాయణంతో సప్తగిరులు మార్మోగాయి. శ్రీమద్ భాగవతం దశమ స్కందంలోని రెండు, మూడు అధ్యాయాల్లోని 97 శ్లోకాలను ఎంత భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు.తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రవచన కర్త శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ శ్రీకృష్ణ జన్మ వృత్తాంతాన్ని వివరించారు.ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు  శేషాచార్యులు,  మారుతి శ్లోక పారాయణం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

Post Midle

Tags:Saptagiris mesmerized by the memory of Harinama- Glorious recitation of Sri Krishna Shloka

Post Midle