సర్ధార్ వల్లబాయ్‌పటేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
పుంగనూరు ముచ్చట్లు:
భారతదేశ ఉక్కుమనిషి సర్ధార్ వల్లబాయ్‌పటేల్‌ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కార్యాలయంలో బోయకొండ చైర్మన్ నాగరాజారెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ తో కలసి సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ప్రతిజ్ఞ చేశారు. అలాగే రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ సేవలను స్మరించుకుంటు విద్యార్థులు పటేల్ బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నారాయణ, ఐకెపి ఏపిఎం రవి, డిప్యూటి తహశీల్ధార్ హరికృష్ణ, వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రభాకర్‌నాయక్, రమణ తదితరులు పాల్గొన్నారు.



Tags: Sardhar Vallabhbhai Patel should be taken as an example
