Natyam ad

పుంగనూరులో ఘనంగా సర్ధార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని గ్రామ పంచాయతీలో సోమవారం ఘనంగా సర్ధార్‌ వల్లబాయ్‌పటేల్‌ జయంతి వేడుకలను సర్పంచ్‌ మునస్వామి ,పంచాయతీ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక సచివాలయం వద్ద నుంచి విద్యార్థులకు, యువతకు పరుగు పందెం పోటీలను నిర్వహించారు. ఈ పరుగు పందెలో గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మునస్వామి మాట్లాడుతూ సర్ధార్‌ వల్లబాయ్‌ పటేల్‌ స్వాతంత్య్ర ఉధ్యమంలో నిర్వహించిన పాత్రను విద్యార్థులకు వివరించారు. దేశానికి ఆయన చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గంగాధర్‌, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు , విద్యార్థులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Sardhar Vallabhbhai Patel’s birth anniversary in Punganur

Post Midle