ఆరు నెలలుగా జీతాలు చెల్లించలేదని ఎస్‌ఆర్‌కె కంపెనీ ఉద్యోగుల ఆందోళన

SARK employees are concerned that employees have not paid salaries for six months

SARK employees are concerned that employees have not paid salaries for six months

– ఆకలి కేకలతో సిబ్బంది
– పట్టించుకోని యాజమాన్యం
– ఆగిపోయిన రోడ్డు పనులు

Date:12/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు బైపాస్‌రోడ్డు పనులు ఆగిపోనున్నాయి. గత ఆరు నెలలుగా ఎస్‌ఆర్‌కె కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడంతో శనివారం ఉద్యోగులు సుమారు 250 మంది కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఎస్‌ఆర్‌కె కంపెనీ వారు పుంగనూరు బైపాస్‌రోడ్డు పనులను చేపట్టారు. ఇందు కోసం బట్టందొడ్డి వద్ద కార్యాలయం , వసతి ఏర్పాటు చేశారు. కాగా గత ఆరు నెలలుగా రోడ్డు పనులు జరగకపోవడంతో కలెక్టర్‌ ప్రద్యుమ్న దీనిపై హెచ్చరికలు చేయడంతో పనులు తిరిగి చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు చేసేందుకు బిహార్‌, ఒరిస్సా , చతీస్‌గడ్‌ , రాజస్థాన్‌, తెలంగాణ, ఆంధ్ర నుంచి వివిధ రకాల సిబ్బంది పనులు చేస్తున్నారు. ఇలా ఉండగా యాజమాన్యం ఆరు నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో కుటుంభాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా జీవనం కష్టమైందని తెలిపారు. ఈ విషయమై ప్రాజెక్టు మేనేజర్‌ శ్రీనివాసులురెడ్డి, జిఎం మోహన్‌నాయుడును పలుమార్లు డబ్బుల విషయం అడిగినా పట్టించుకోలేదన్నారు. దీంతో రెచ్చిపోయిన సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేసి, వ్యతిరేక నినాదాలు చేశారు. నివాస స్థలాలలో కరెంటు, భోజనం సైతం లేకుండ ఇబ్బంది పడుతున్నామని ఆరోపించారు. ఈ విషయమై వివరణ కోరటానికి ఎవరు అందుబాటులో లేరు. కాగా జీతాలు చెల్లించే వరకు పనులు చేసేది లేదని సిబ్బంది నిఖచ్చిగా తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ వెంటనే చర్యలు తీసుకుని , జీతాలు చెల్లించాలని సిబ్బంది కోరుతున్నారు.

 

వివేకానందుని జీవితం యువతకు ఆదర్శప్రాయం

Tags: SARK employees are concerned that employees have not paid salaries for six months

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *