ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచడంపై సర్కార్ బడి బాట

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచడంపై సర్కార్ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా చేపట్టనుంది.కాగా ఈ బడిబాట కార్యక్రమాన్ని తొలుత జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించాలని భావించింది. కానీ ఈ తేదీలను విద్యాశాఖ రీ షెడ్యూల్ చేసింది. బడి బాటలో భాగంగా స్కూల్ ఏజ్ పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్చేలా చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా చూడాల్సి ఉంటుంది. చిన్నారులను అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా చేర్పించాలని పేర్కొంది. కాగా బడిబాటలో భాగంగా కలెక్టర్ల నుంచి మొదలు డీఈవో, ఎంఈఓ, హెడ్ మాస్టర్, టీచర్ వరకు ప్రతి ఒక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించారు. ఇదిలా ఉండగా జూన్ 3 నుంచి జూన్ 11 వరకు బడి బాటలో భాగంగా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు వీరు పాల్గొనాల్సి ఉంటుంది. జూన్ 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో 11 వరకు కీలకంగా మారనుంది.

 

 

జూన్ 3న బడి బాటలో భాగంగా గ్రామాల్లో పలు ఆర్గనైజేషన్లతో సమావేశాలు నిర్వహించి అడ్మిషన్లు పెరిగేలా చూడాల్సిన బాధ్యత సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ఏఏపీసీ మెంబర్లు, హెచ్ఎం, టీచర్లు, పేరెంట్స్ పై ఉండనుంది. వచ్చే నెల 4న గ్రామాల్లో డోర్ టు డోర్ ప్రచారం చేపట్టి అడ్మిషన్లు జరిగేలా చేపట్టాల్సి ఉంటుంది. వచ్చేనెల 5 నుంచి 10 వరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేపట్టి అంగన్‌వాడీ తో పాటు ప్రభుత్వ స్కూళ్లలో అన్ని క్లాసుల వారీగా అడ్మిషన్లు పొందేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. జూన్ 11న గ్రామ సభ నిర్వహించి పాఠశాల మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్చడం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా వచ్చే నెల 12న పాఠశాల పున:ప్రారంభం కానుంది. 13న ఫౌండేషన్ లిటరసీ ప్రోగ్రామ్, లెర్నింగ్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రామ్, 14న సామూహిక అక్షరాభ్యాసం, 15న ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ డే అండ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ డే, 18న డిజిటల్ క్లాసులు, ప్లాన్ టేషన్ పై అవేర్ నెస్ కల్పించనున్నారు. 19న స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

 

Tags: Sarkar Badi Bata on increasing admissions in government schools

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *