దిద్దుబాటు చర్యల్లో  సర్కార్

కరీంనగర్ ముచ్చట్లు:


తెలంగాణ ప్రభుత్వ అద్భుత కట్టడం అభాసుపాలైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు కీలక పంప్ హౌస్‌లు వరద నీటిలో మునగడంతో రీ డిజైన్‌ను తప్పు పడుతున్నారు. ఈ ప్రాజెక్టు తప్పిదాలను తెరకెక్కుండా టీఆర్ఎస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. రాజకీయాల్లోకి లాగకుండా కొత్త అంశాలను తెరపైకి తీసుకువస్తోంది. అనుకున్నట్టే.. సర్కారు ప్లాన్సక్సెస్ అవుతోంది. విపక్షాలు కాళేశ్వరం కథల నుంచి బయటపడుతున్నారు. కీలక అంశంలో సైతం చేతులెత్తేశారు. ఇప్పుడు దీనిపై అంతా సెలైంట్ అయ్యారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టును గట్టెక్కించేందుకు జల వనరుల శాఖ విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. లోపల చాలా అనుమానాలున్నా.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఇదే సమయంలో విపక్షాలు సైతం దారి మళ్లాయి.కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పులు, లోపాలను బయటకు రాకుండా సర్కారు ఉన్నఫళంగా గట్టి చర్యలు చేపట్టింది.

 

 

 

ఈ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల పలువురు అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తే.. తిప్పి పంపించారు. 144 సెక్షన్ అంటూ నిర్భందం పెట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఏదో ఓ సందర్భంలో వ్యతిరేకంగా మాట్లాడుతున్న రిటైర్డ్ ఐఏఎస్ఆకునూరి మురళి ఐదు రోజుల ముందుగానే అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, మధ్యలోనే అడ్డుకున్నారు. మీడియాకు అక్కడ అసలే ఎంట్రీ లేదు. తాజాగా తీన్మార్మల్లన్న, తొలి వెలుగు ప్రతినిధుల బృందం భారీ సంఖ్యలో వెళ్లేందుకు చూసినా అడ్డుకుని, అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంజినీర్లకు మినహా ఎవరికీ అవకాశం లేదు. అంతేకాదు.. అక్కడి ఫొటోలు, వీడియోలు బయటకు వస్తే ఇంజినీర్లదే బాధ్యతగా హెచ్చరించారు.వాస్తవానికి, కాళేశ్వరం లోపాలు విపక్షాలకు అతిపెద్ద ఆయుధాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి చెప్పుకునే బ్రహ్మాస్త్రం ఇదే ప్రాజెక్టు. ఎనిమిదేండ్ల పాలనలో ప్రధాన పథకం ఇదే. ఇలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్‌లు నీట మునగడంపై బీజేపీ మౌనం పాటిస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ప్రాజెక్టు అనుమతులన్నీ కేంద్రం ఇవ్వడమే. మూడో టీఎంసీ పనులకు మినహా.. దాదాపు 10 అనుమతులు కేంద్రం జారీ చేసింది. అంతేకాకుండా కొన్ని బ్యాంకుల నుంచి అప్పుకు కూడా ఆమోదం చెప్పింది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకునే అప్పులపై బ్యాంకులు ఇబ్బంది పెట్టకుండా కేంద్రం నుంచి గతంలో స్పష్టమైన ఆదేశాలున్నాయి. ప్రస్తుతం హెడ్రెగ్యులేటర్లాక్ఉండగానే పంప్హౌస్‌లు మునిగాయి.

 

 

 

 

దీనికి రీ డిజైన్కారణమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కానీ, ఇప్పుడు ఈ ప్రాజెక్టు లోపాలపై గళమెత్తితే.. కేంద్రంపై రిమార్కు వస్తుందనే ఉద్దేశంతో బీజేపీ అసలు మాట్లాడటమే లేదు.ఈ ప్రాజెక్టుపై బీజేపీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా టీఆర్ఎస్ఎదురుదాడికి అస్త్రాలు సిద్ధం చేసుకుంది. కేంద్రమే అనుమతులిచ్చిన ప్రాజెక్టును ఎలా తప్పుపడుతారంటూ ఎమ్మెల్యేల నుంచి సీఎం దాకా బీజేపీని ఇరుకున పెట్టేందుకు సిద్ధమైంది. కానీ, ఒకవిధంగా బీజేపీ వ్యూహత్మకంగా మౌనం దాల్చడంతో.. టీఆర్ఎస్ కొంత అసంతృప్తికే గురైనట్లు కనిపిస్తోంది. అందుకే మంత్రులు, ప్రజాప్రతినిధులతో కాకుండా కేవలం ఇంజినీర్లు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఇరిగేషన్నిపుణులతో మాత్రమే ప్రచారానికి దిగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మునగడంపై వస్తున్న విమర్శలను అధికారబృందంతోనే ఖండిస్తోంది. జల వనరుల శాఖ స్పెషల్చీఫ్సెక్రెటరీ నుంచి కిందిస్థాయి ఇంజినీర్ల వరకు ఏదో ఓ సందర్భంలో కౌంటర్ఇస్తూనే ఉన్నారు. ప్రధానంగా బీజేపీ నుంచి ఎలాంటి విమర్శలు లేకపోవడంతో టీఆర్ఎస్కూడా సైలెంట్‌గా వ్యవహరిస్తోంది.కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఈ పరిణామాలకు వాస్తవానికి కాంగ్రెస్‌కు మంచి అస్త్రాలే. కానీ, తొలి రెండు రోజులు ప్రకటనలు, ట్విటర్లకు పరిమితమైంది. ఆ తర్వాత అసలు ఈ విషయాన్నే వదిలేసింది. టీఆర్ఎస్ సర్కారు తమ అతిపెద్ద డ్రీమ్ప్రాజెక్టుగా చెప్పుకునే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, రీ డిజైనింగ్ తప్పిదాలపై కాంగ్రెస్కూడా ఎందుకు మౌనంగా ఉంటుందనేదే మిలియన్డాలర్ల ప్రశ్నగా మారింది.

 

 

 

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఈ అంశాల నుంచి దారి మళ్లించడంతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ సక్సెస్అయ్యారు. గతంలో చిన్న చిన్న చెక్డ్యాంలు చెడిపోతేనే నిరసనలకు దిగే విపక్షాలు ఈ అతిపెద్ద ప్రాజెక్టు అంశంలో కనీసం వేలెత్తి చూపించకపోవడం, ప్రశ్నించకపోవపడంలో టీఆర్ఎస్ హ్యాపీగా ఉంటోంది. ముందుగా క్లౌడ్బరెస్ట్, ఆ తర్వాత పోలవరం అంటూ కాళేశ్వరం అంశాన్ని వ్యూహత్మకంగా దారి మళ్లించారు. ఈ ప్లాన్ వర్కవుట్ అయి, విపక్షాలు కూడా ఫెయిల్యూర్ అవుతున్నాయి.వరదల సమయంలో ప్రాజెక్టుల్లోకి నీరు రావడం సహజమే అనే ఒకే ఒక్క అంశంతో ప్రభుత్వం ఈ అపవాదు నుంచి బయటపడుతోంది. కానీ, ఇరిగేషన్ రిటైర్డ్ఇంజినీర్లు, గతంలో అదే జిల్లాకు కలెక్టర్‌గా పని చేసి, ఈ ప్రాజెక్టు నిర్మాణం నుంచి అన్నీ తెలిసిన రిటైర్డ్ఐఏఎస్ఆకునూరి మురళి వంటి వారు మాత్రం తప్పుడు ప్రాజెక్టు, డిజైనింగ్ లోపం అంటూ నెత్తీనోరూ బాదుకుంటున్నారు. దీనికి సంబంధించిన కొన్ని కీలకమైన ఫైళ్లు కూడా తన వద్ద ఉన్నాయంటూ విపక్షాలకు తెలిసి వచ్చేలా చెప్పారు. కానీ, వారి నుంచి ఆధారాలు తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకెళ్లడం లేదు. ఈ ప్రాజెక్టు డిజైనింగ్మీద ఇప్పటికే రిటైర్డ్ఇంజినీర్లు లక్ష్మీనారాయణతో పాటు పలువురు మీడియా ముందు చెప్పారు. రిటైర్డ్ఐఏఎస్మురళి కూడా అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, రాష్ట్రంలోని విపక్షాలు మాత్రం సీఎం కేసీఆర్చక్రంలో చిక్కుకుని.. అసలు విషయాన్ని పక్కకు పడేశాయి.

 

Tags: Sarkar in corrective measures

Leave A Reply

Your email address will not be published.