పుంగనూరు మండల రెండవ వైస్ ఎంపిపిగా సరోజమ్మ
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మండల రెండవ వైస్ ఎంపిపిగా తొలి సారి ఎస్టీ కులానికి చెందిన బి.సరోజమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంపిటిసిల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాళ్యెంపల్లె ఎంపిటిసి బి.సరోజమ్మను మోదుగులపల్లె ఎంపిటిసి సురేంద్ర ప్రతిపాదించగా , చండ్రమాకులపల్లె ఎంపిటిసి శైలజారెడ్డి ఆమోదించారు. పోటీలో ఎవరు లేకపోవడంతో సరోజమ్మను ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు తొలి సారిగా ఎస్టీ మహిళకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. అందరు ఐకమత్యంతో మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నూతన వై స్ ఎంపిపిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మిపతి, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న, ఒకటవ వైస్ ఎంపిపి ఈశ్వరమ్మ, ఏవో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Sarojamma is the second Vice MP of Punganur constituency