రన్నరప్‌గా నిలిచిన సరోజిని అకాడమీ జట్టు

National ex-volleyball players, TSRTC senior public relations manager,

National ex-volleyball players, TSRTC senior public relations manager,

క్రీడాకారులకు టి.ఎస్‌.ఆర్టీసీ ఎస్‌.పి.ఆర్‌.ఎం శ్రీ జి.కిరణ్‌ రెడ్డి అభినందనలు
Date:12/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
క్రీడల్లో గెలుపోటములు సాధారణమని, ఏదైనా స్ఫూర్తిగా తీసుకోవాలని జాతీయ మాజీ వాలీబాల్‌ క్రీడాకారులు, టి.ఎస్‌.ఆర్‌.టి.సి సీనియర్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజర్‌,  జాతీయ మాజీ వాలీబాల్‌ క్రీడాకారులు, సరోజిని అకాడమీ కార్యదర్శి జి.కిరణ్‌ రెడ్డి ఉద్భోదించారు. ఖాజా క్రికెట్‌ అకాడమీ ఎల్‌.బి.నగర్‌లో నిర్వహించిన దసరా కప్‌ లీగ్‌ మ్యాచ్‌లో ఫైనల్‌కు చేరుకున్న సరోజిని క్రికెట్‌ అకాడమీ జట్టుకి కొద్దిలో కప్‌ చేజారిపోయింది. ఈ నెల 10నుంచి 12వరకు జరిగిన మ్యాచ్‌లో రెండు ఆటల్లో సరోజిని జట్టు క్రీడా  నైపుణ్యాన్ని ప్రదర్శించినా తుదిపోరులో ఓటమి చెందటంతో ఈ టీం రన్నరప్‌గా నిలిచింది. తొలిపోరులో ఖాజా క్రికెట్‌ అకాడమీతో తలపడిన సరోజిని జట్టు 29 పరుగులతో ముందు వరుసలో నిలిచింది. 20ఓవర్లలో 153 పరుగులు చేయగా ఖాజా అకాడమీ 18.5 ఓవర్లలో 124 పరుగుల వద్దే కుప్పకూలింది.
సరోజిని అకాడమీ జట్టు సభ్యులు హృతిక్‌ – 77  (9 x 4), మోహిత్‌ – 27 ( 2 x 4) చేసి విజయానికి దోహదపడ్డారు. రెండో లీగ్‌ మ్యాచ్‌లో సరోజిని అకాడమీ జట్టు 60 పరుగులతో ముందజలో నిలిచింది. నాలుగు వికెట్లు కోల్పోయి 118 స్కోరు (వంశీ-64 (4 x 6), భరద్వాజ్‌- 36 (3 x 4) చేయగా,  ఖాజా అకాడమీ జట్టు కేవలం 58 పరుగుల వద్ద ఓటమి పాలైంది. తుది పోరులో సరోజిని అకాడమీ జట్టు 24 పరుగుల తేడాతో వెనుకబడిపోవడంతో జి.ఎన్‌.ఆర్‌ క్రికెట్‌ అకాడమీ కప్‌ను దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన జి.ఎన్‌.ఆర్‌ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. ఆనంతరం బ్యాటింగ్‌కు దిగిన సరోజిని జట్టు 6వికెట్లు కోల్పోయి (హృతిక్‌-49 (4 x 4), భరద్వాజ్‌-42 (4 x 2) 140 పరుగులే చేయగలిగింది.
దీంతో ఈ జట్టు రన్నరప్‌గా నిలిచింది. బెస్ట్‌ బౌలర్‌గా రిత్విక్‌ కల్వ ,సరోజిని అకాడమీ విద్యార్థులు రిత్విక్‌ కల్వ , హృతిక్‌లు మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరు కనబరిచారు. మూడు మ్యాచ్‌లో తమదైన ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రితిక్‌ కల్వ తొలి మ్యాచ్‌లో 6 వికెట్లు, రెండో మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి ప్రత్యర్థుల పరుగుల దూకుడును కట్టడి చేశాడు. దీంతో కల్వ బెస్ట్‌ బౌలర్‌గా నిలిచాడు.ఈ సందర్భంగా బాగ్‌లింగంపల్లిలోని సరోజిని క్రికెట్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ అకాడమీ కార్యదర్శి జి.కిరణ్‌ రెడ్డి విద్యార్థులకు అపజయాలను  విశదీకరించారు. మ్యాచ్‌లో ఎలా తలపడి విజేతలుగా నిలువాలనే అంశంపై మార్దనిర్థేశం చేశారు. ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ప్రత్యర్థి జట్టును మనో ధైర్యంతో ఎదుర్కోవడంతోనే విజయాన్ని సాధించవచ్చని సూచించారు. గెలవాలన్న తపన ఉన్నప్పుడే క్రీడారంగంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి సాధ్యపడుతుందని చెప్పారు. క్రికెట్‌ కోచ్‌ ధనుంజయ్‌ సరోజిని అకాడమీ జట్టుకు సమన్వయకర్తగా వ్యవహరించారు.
Tags:Sarojini Academy runner was runner-up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *