సారొస్తారా..?  

Date:18/02/2020

నిజామాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ల కొరత ఎక్కువగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వర్సిటీ ప్రారంభించినప్పుడు 144 అధ్యాపక పోస్టులు

మంజూరయ్యాయి. ప్రస్తుతం 76 మంది ఆచార్యులే ఉన్నారు. సుమారుగా 70 మంది ఒప్పంద, తాత్కాలిక అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. రెండేళ్ల కిందట ప్రభుత్వం తెవివికి 68

ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇందులో 24 సహాయ ఆచార్యులు, 26 అసోసియేట్‌, 11 ఆచార్యులు, 5 సహాయ లైబ్రేరియన్‌, 2 లైబ్రేరియన్‌ ఉద్యోగాలున్నాయి.

ప్రభుత్వం అనుమతిచ్చినా పోస్టుల భర్తీపై స్పష్టత, ఉద్యోగ ప్రకటన లేక రెండేళ్లుగా నిరీక్షణ తప్పడం లేదు. వాస్తవానికి రెండేళ్ల పీజీ కోర్సుకు ఏడుగురు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుకు తొమ్మిది

మంది రెగ్యులర్‌ ఆచార్యులు ఉండాలి. తెవివి ప్రధాన క్యాంపస్‌, భిక్కనూర్‌ దక్షిణ ప్రాంగణంతో పాటు సారంగాపూర్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీలో 29 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా

ఏర్పాటు చేసిన వాటిల్లో శాశ్వత ఆచార్యులు లేరు. బీఈడీ, ఎంఈడీ, ఎల్‌ఎల్‌ఎం, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్‌, ఫార్మస్యూటికల్‌ కెమిస్ట్రీ, గణితం, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఐదేళ్ల ఐఎంబీఏ

విభాగాలకు పోస్టులు కూడా మంజూరు కాలేవు. ఈ ఏడాది ప్రారంభించిన మూడు కోర్సులదీ అదే పరిస్థితి. ఎమ్మెస్సీ అప్లాయిడ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగంలో రెగ్యులర్‌ సిబ్బంది ఒక్కరే ఉండటం

గమనార్హం. ఈ లెక్కన చూస్తే ఇంకా 80 రెగ్యులర్‌ ఆచార్యుల పోస్టులు అదనంగా అవసరం. ప్రభుత్వం మాత్రం గతంలో ఖాళీగా ఉన్న వాటి భర్తీకే అనుమతి ఇస్తోంది. వర్సిటీలో

విద్యాభ్యాసానికి ఆచార్యులు, పరిపాలన కార్యకలాపాలకు బోధనేతర సిబ్బంది అవసరం. మొత్తంగా చూస్తే 8 మంది మాత్రమే ఉన్నారు. గ్రంథాలయ నిర్వహణ, సీనియర్‌ అసిస్టెంట్లు,

జూనియర్‌ అసిస్టెంట్లు, ప్రోగామర్లు, టైపిస్టులు, ఆఫీస్‌ బాయ్‌లు, స్వీపర్లు ఇలా వివిధ రకాల సిబ్బంది ఉండాలి. వర్సిటీ ప్రారంభం నుంచి పొరుగు సేవల సిబ్బందికి చాలీచాలని వేతనిమిస్తూ

నెట్టుకొస్తున్నారు. 250 మందిని నియమించాల్సిన అవసరం ఉంది. 2018 ఫిబ్రవరిలో ప్రభుత్వం రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల భర్తీకి అనుమతిచ్చింది. సంబంధిత దస్త్రంపై

సీఎం కేసీఆర్‌ సంతకం చేశారని, వర్సిటీల్లో పని చేస్తున్న ఒప్పంద ఆచార్యుల సమస్య పరిష్కారమవగానే నోటిఫికేషన్‌ వస్తుందని అప్పట్లో మంత్రులు ప్రకటన చేశారు. ఉత్తర్వులు వచ్చేలోగా

అంతర్గతంగా పోస్టులు రోస్టర్‌ పాయింట్లు, రిజర్వేషన్‌ జాబితా సిద్ధం చేసుకోవాలని ఉపకులపతుల సమావేశాల్లో అప్పటి ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

సూచించారు. ఉద్యోగాలపై నిర్ణయం తీసుకుని రెండేళ్లు కావస్తున్నా అడుగు మందుకు పడటం లేదు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చినా దరఖాస్తు స్వీకరణ, పరీక్ష నిర్వహణ,

మౌఖిక, ముఖాముఖి పరీక్షలు, ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించాలంటే ఐదు నెలల సమయం పట్టే అవకాశముంది.

నాడి పట్టేదెవరు..? 

Tags: Sarostara ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *