వృద్ధులకు అన్న ప్రసాదం పంపిణీ చేసిన సర్పంచ్
ఒంటిమిట్ట ముచ్చట్లు:
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం నే క నా పురం గ్రామపంచాయతీ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు సిద్ధవటం మండలం భాకరాపేట సిద్ధవటం ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న పరమాత్మ సేవ ఆశ్రమం లో ఈరోజు సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి తల్లి సుబ్బమ్మ మూడవ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సర్పంచ్ కుమారుడు రమణారెడ్డి మాట్లాడుతూ ఈరోజు వృద్ధులకు అన్నప్రసాదాలు సమర్పించడం చాలా సంతోషమని ప్రతి ఒక్కరు కూడా మండల పరిధిలో ఉన్న దాతలు స్పందించి వృద్ధులకు అన్నప్రసాదాలు సహాయ కార్యక్రమాలు చేయాలని ఈశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు మీడియా పరంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈశ్వర్ రెడ్డి ధర్మపత్ని నారాయణమ్మ కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు ఎరుకల రెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Sarpanch who distributed prasadam to the elderly

