పుంగనూరు స్వచ్చ సంకల్పంలో సర్పంచ్‌లు భాగస్వామ్యులుకావాలి

పుంగనూరు ముచ్చట్లు:

 

గ్రామ ప్రాంతాలలో జూలై 8 నుంచి ప్రభుత్వం నిర్వహించనున్న స్వచ్చ సంకల్ప కార్యక్రమాలలో సర్పంచ్‌లు, ప్రజలు భాగస్వామ్యులు కావాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మంత్రి పెద్దిరెడ్డి అమరావతి నుంచి సర్పంచ్‌లతో వీడియో కార్యక్రమం నిర్వహించారు. పుంగనూరు మండలంలోని ప్రతి గ్రామంలోను పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలను ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆదర్శవంత నియోజకవర్గంగా ఉండేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వరి, ఈవోపీఆర్‌డి కృష్ణవేణి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Sarpanches should be partners in the pure will of Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *