ఎమ్మెల్యే రెడ్డి ముందే కన్నీరు పెట్టుకున్న సర్పంచ్ భర్త
మెదక్ ముచ్చట్లు:
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముందు వెంకట్రావు పేట్ సర్పంచ్ నజీయా భర్త సలావుద్దిన్ కన్నీరుపెట్టుకున్నారు. గురువారం నాడు గ్రామంలో అసరా పెన్షన్ కార్డుల పంపిణీకి ఎమ్మెల్యే వచ్చారు. కార్యక్రమంలో సలావుద్దిన్ మాట్లాడుతూ సర్పంచ్ గా ఉన్న ఎలాంటి పనులు చేసే అవకాశం లేదనిఅన్నారు. పని చేసేందుకు ప్రజలు సర్పంచ్ గా అవకాశం కల్పించారని, కానీ ఇప్పుడు గ్రామాలలో ఎలాంటి పనులు చేయలేకపోతున్నందుకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని సర్పంచ్ భర్త వాపోయాడు.
Tags: Sarpanch’s husband who shed tears before MLA Reddy

