సరూర్ నగర్ హత్యకేసు..నిందితులకు జీవిత ఖైదు

రంగారెడ్డి ముచ్చట్లు:

 


సరూర్ నగర్ హత్య కేసులో నిందితుడికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది.  ఈమేరకు శుక్రవారం నాడు  తీర్పు నిచ్చింది.  హైదరాబాద్ లో సరూర్ నగర్ లో జరిగిన నాగరాజు హత్య కేసు సంచలనం సృష్టించింది.  మతాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో నాగరాజును నడిరోడ్డుపై  యువతి సోదరుడు హత్య చేసిన విషయం తెలిసిందే. ఆశీన్ సుల్తానా, నాగరాజు ఐదేళ్లుగా ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు.  మే 4, 2022లో నాగరాజును పథకం ప్రకారం సుల్తాన సోదరుడు నాగరాజును హతమార్చాడు.ఏ 1 మోబిన్ అహమ్మద్, ఏ2 మసూద్ అహ్మద్ లను 120బి,  341, 302, రెడ్ విత్ 34, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి.

Post Midle