Natyam ad

సర్వభూపాల వాహనం ట్రయల్ రన్

తిరుమల ముచ్చట్లు:

 

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్టతను పరిశీలించేందుకు ఆదివారం టిటిడి అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.శ్రీ మలయప్పస్వామివారు విహరించే అన్ని వాహనాల్లో సర్వభూపాల వాహనం ఎక్కువ బరువుగా ఉంటుంది. ఈ వాహన సేవ సమయంలో వాహనబేరర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఆలయ పేష్కార్ శ్రీ శ్రీహరి, పార్ పత్తేదార్ శ్రీ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టిటిడికి 10 గొడుగులు విరాళం

Post Midle

చెన్నైలోని శ్రీ అలమేలు మంగమ్మ చారిటబుల్ ట్రస్టుకు చెందిన పి.గోపాలకృష్ణ ఆదివారం తిరుమల శ్రీవారికి 10 గొడుగులు విరాళంగా అందించారు. తిరుమలలోని వైభవోత్సవ మండపం వద్ద బోర్డు సభ్యులు   మూరంశెట్టి రాములు చేతులమీదుగా ఆలయ పేష్కార్  శ్రీహరికి గొడుగులు అందజేశారు.

 

Tags: Sarvabhupala vehicle trial run

Post Midle

Leave A Reply

Your email address will not be published.