సర్వదర్శనం టోకెన్లు భారీగా పెంచిన టీటీడీ

తిరుమల ముచ్చట్లు:

 

నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించారు.అందుకు తగిన రీతిలో టీటీడీ ఈఓ, అదనపు ఈఓలుగా శ్యామలరావు, వెంకయ్య చౌదరిని నియమించి తిరుమలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.దీంతో ఈఓ, అదనపు ఈఓలు తిరుమలలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు.గత ప్రభుత్వ హయాంలో శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్లను అపరిమితంగా జారీ చేసేవారు. కూటమి అధికారంలోకి వచ్చాక రోజుకు వెయ్యి టికెట్లు మాత్రమే జారీ చేస్తున్నారు.దీంతో సాధారణ భక్తులకు దర్శన సమయం ఎక్కువ అందుబాటులోకి రావడంతో అందుకు తగిన రీతిలో సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల సంఖ్యను పెంచారు.గతంలో నెల వరకు 4 లక్షల సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్యను కూటమి ప్రభుత్వం 6 లక్షలకు పెంచింది.సర్వదర్శన టోకెన్ల సంఖ్య పెంచడంతోపాటు భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగుపరచడంపై టీటీడీ దృష్టి సారించింది. దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు గతంలో అన్న ప్రసాదాలు తగిన రీతిలో అందచేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు అందచేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షించడానికి అధికారులను నియమించారు.

 

Tags: Sarvadarshanam Tokens are hugely boosted by TTD

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *