Natyam ad

శ్రీ‌వారి ఆల‌యంలో స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభం- ముగిసిన సూర్య‌గ్ర‌హ‌ణం

– రాత్రి 8.30 నుండి య‌ధావిధిగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌

 

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

శ్రీ‌వారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం రాత్రి 8.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. ఉద‌యం 7 నుండి 7.45 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌ను స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమ‌తించారు. సాయంత్రం 5.11 నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉన్న కారణంగా ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఉద‌యం 8.11 గంట‌ల‌కు ఆల‌యం త‌లుపులు మూశారు. దాదాపు 12 గంట‌ల అనంత‌రం రాత్రి 7.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. ఆల‌య శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, రాత్రి కైంక‌ర్యాలు నిర్వ‌హించారు. రాత్రి 8.30 నుండి 12.30 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభం

సూర్య‌గ్ర‌హ‌ణం కార‌ణంగా మంగ‌ళ‌వారం ఉద‌యం 8.11 గంట‌లకు మూసివేసిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్సును రాత్రి 7.30 గంట‌లకు తెరిచారు. వంట‌శాల శుద్ధి అనంత‌రం రాత్రి 8.30 గంట‌ల నుండి భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ ప్రారంభ‌మైంది. అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్స్ మూసివేత వ‌ల్ల భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా ఉద‌యం 6 గంట‌ల‌కు ఫుడ్ కౌంట‌ర్ల‌లో దాదాపు 10 వేల మందికి అల్పాహారం అందించారు. అదేవిధంగా, వైభ‌వోత్స‌వ మండ‌పం, సిఆర్వో వ‌ద్ద దాదాపు 30 వేల పులిహోర పొట్లాలు భ‌క్తుల‌కు పంపిణీ చేశారు.టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్  శ్రీ‌హ‌రి, ఏఈవో పార్థ‌సార‌ధి, విజివో బాలిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags: Sarvardarshan at Srivari Temple Start-End Solar Eclipse