అగ్రి ల్యాబ్ ను ప్రారంభించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి

నెల్లూరు       ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల కేంద్రంలో మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి  జయంతి సందర్భంగా “రైతు దినోత్సవ” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి, అగ్రి ల్యాబ్ ను స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను గ్రామస్థాయి, వ్యవసాయ సలహా మండలి సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు , జాయింట్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, అధికారులు, రైతులతో కలిసి పాల్గొని రైతులనుద్దేశించి ప్రసంగించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయశాఖ, పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో నూతన పద్ధతులను అవలంబిస్తూ, తక్కువ ఖర్చుతో, ఎక్కువ లాభాలను గడిస్తున్న రైతులకు పురస్కారాలు అందజేశారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Sarvepalli MLA Kakani who started Agri Lab

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *