Natyam ad

శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ

తిరుప‌తి ముచ్చట్లు:

 

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 4న జరుగనున్న పుష్పయాగానికి బుధ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.సాయంత్రం 6 గంటల నుండి పుణ్యాహ‌వ‌చ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం చేపట్టారు.ఏప్రిల్ 4న ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 4న తిరుప్పావ‌డ‌, నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో  వరలక్ష్మి, ఏఈవో  గోపినాథ్‌, సూపరింటెండెంట్లు  చెంగల్రాయలు,  వెంకట స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్  కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

 

Tags:Sastroktanga Ankurarpana for Sri Kalyana Venkateswara Swamy’s Puspa Yaga

Post Midle
Post Midle