సత్యవేడులో పసరు మందులే దిక్కు

Date:16/12/2019

తిరుపతి ముచ్చట్లు:

సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండల పరిధిలోని పలు గ్రామాలు పట్టణాలకు దూరంగా అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ గ్రామాలకు కోవనూరు, కేవీబీపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. పీహెచ్‌సీలకు వెళ్లాలంటే 8 కి.మీ దూరం ఉంది. అక్కడకు వెళ్లినా మెరుగైన వైద్యం అందే పరిస్థితి లేదు. 24 గంటల ఆస్పత్రి అయినా వైద్యులు ఉండరు. ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. ప్రతి బుధ, శనివారాల్లో చిన్నారులు, గర్భిణులకు వ్యాక్సిన్లు వేయాల్సి ఉన్నా ఆ దాఖలాలు లేవని బస్సులు, ఆటోలు అందుబాటులో లేకపోతే బైక్‌పై తీసుకెళ్లాలి. లేదంటే గ్రామంలోనే ప్రాణాలు విడవాల్సిన పరిస్థితి.జయలక్ష్మి కాలనీకి చెందిన దంపతులకు నాలుగేళ్ల తర్వాత కలిగిన మగబిడ్డకు జబ్బు చేసింది. పెద్దలు చెప్పారని నాటు మందులు వాడారు. బిడ్డకు ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. పాలు పట్టిస్తే నేరుగా ఊపిరితిత్తులకు చేరి వాపు రావడంతో భయంతో వారం రోజుల పాటు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. డబ్బులు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోయింది. కొన్ని రోజులకు బిడ్డ చనిపోయాడు. బైరాజుకండ్రిగకు చెందిన రెండేళ్ల వయస్సు ఉన్న పాపకు ఎక్కిళ్లు ఎక్కువ కావడంతో గ్రామంలోని పెద్దావిడ మాటలు విని ఆకు పసరు మందు తాగించారు. తీవ్రమైన దగ్గు, ఆయాశంతో పాటు నోటి నుంచి రక్తం కారడం మెదలైంది. చాలా ఆస్పత్రులు తిరిగారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడవడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించింది.

 

 

 

 

 

 

 

 

చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దిగువపుత్తూరుకు చెందిన సుప్రియకు చెందిన ఏడాదిన్నర బిడ్డ ఏసుకు కామెర్ల వ్యాధి సోకింది. స్థానిక ఆచారాలు, పెద్దలు చెప్పిన మాట విని ఆ తల్లి నాటు వైద్యుడి చేత చిన్నారి నుదురు, చేతిపై ఇనుప కమ్మిని ఎర్రగా కాల్చి పెట్టించింది. అనంతరం ఆకు పసరు ఇచ్చారు. తొమ్మిది రోజుల తర్వాత ఏసు మరణించింది.  కేవీబీపురం మండలం ఎస్‌ఎల్‌పురం గ్రామానికి చెందిన శ్యామల బిడ్డకు ఎనిమిది నెలల వయస్సులో జ్వరం వచ్చింది. నాటు మందులు వాడాల్సి వచ్చింది. నాలుగు రోజుల తర్వాత కడుపు బాగా ఉబ్బిపోయింది. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సమయానికి వైద్యం అందకపోవడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ చెయ్యి జారిపోయాడు. స్థానికులు చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు వెళ్లాలంటే 30 కి.మీ దూరంలోని శ్రీకాళహస్తి, 48 కి.మీ దూరంలో ఉన్న తిరుపతికి పరుగులు తీయాల్సి వస్తోంది. పెరిం దేశం గ్రామానికి చెందిన ఇంకా పేరు పెట్టని 53 రోజుల చిన్నారి, లిఖిత (7నెలలు) తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్నారు. ఇందులో లిఖిత పరిస్థితి విషమంగా ఉంది. కొప్పేడుకు చెందిన 18 నెలల మోక్షిత, బంగారమ్మకండ్రిగకు చెందిన రెండున్నరేళ్ల వరలక్షి్మ, సరస్వతీకండ్రిగకు చెందిన రోహిణి (17 నెలలు) పుత్తూరు చిన్నపిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

మళ్లీ యాక్టివ్ గా గల్లా అరుణ…

 

Tags:Sathivadevu is a few medicines

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *