Date:08/12/2019
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలో ఆదివారం జరిగిన ఓ మైనార్టీ నేత కుమార్తె వివాహానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, భూగర్భ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలతమ్మ హాజరయ్యారు. పుంగనూరు నుండి పలమనేరు వెళ్లే రహదారిలోని వాసవీ కళ్యాణ మండపంలో మాజీ కో ఆప్షన్ సభ్యులు ఖాదర్ భాష కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకలకు మంత్రి సతీమణి స్వర్ణాలతమ్మ రాగానే మైనార్టీ నేతలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. నూతన వధూవరులను ఆమె ఆశీర్వదించారు. పట్టణంలోని మైనార్టీ సోదరులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఎప్పుడూ తమ ప్రేమను చూపుతారని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
Tags:Satimani is the minister of minority wedding ceremonies