Natyam ad

కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా సతీష్ కుమార్

కాకినాడ ముచ్చట్లు:


కాకినాడ జిల్లా నూతన ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ విధుల్లో చేరారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన పూర్వపు ఎస్పి ఎం రవీంద్రనాథ్ బాబు నుంచి బాధ్యతలు స్వీకరించారు. 2016 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన సతీష్ కుమార్ తమిళనాడుకు కి చెందిన వాడు. బీటెక్ (బయోటెక్నాలజీ) అభ్యసించిన సతీష్ కుమార్ కు భార్య ధరణ్య, కుమారుడు దేవరుద్రన్ ఉన్నారు. 2002లో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్ష రాసి.. ఖజానా శాఖలో ఉద్యోగం పొందారు. 2015 వరకు ఖజానా శాఖలో ఉద్యోగం చేస్తూ సెలవు పెట్టి సివిల్స్ కు సిద్ధమయ్యారు. 2016 సివిల్ సర్వీసులో ఐపీఎస్ కు ఎంపికయ్యారు. గ్రేహౌండ్ అసాల్ట్ కమిషనర్, చింతపల్లి ఏఎస్పీ, నర్సీపట్నం ఓఎస్డి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీగా పని చేస్తూ కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చారు. శాంతి భద్రతలకు తొలి ప్రాధాన్యతని ఆయన మీడియాకు ఇవాళ చెప్పారు. చిన్నా పెద్ద,, పేద గొప్ప తేడా లేకుండా న్యాయం చేయడానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఈ ఏడాది ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల కోడ్ ఉల్లంగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గంజాయి రవాణా విషయంలో పూర్వపు ఎస్పి తీసుకున్న చర్యలను పరిగణలోకి తీసుకొని తాను కూడా కఠిన చర్యలు చెప్పడతానని వివరించారు. 82 కాకినాడ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయనను జిల్లా పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

 

Tags; Satish Kumar as the new SP of Kakinada district

Post Midle
Post Midle