పేద విద్యార్థినులకు సంతూర్ స్కాలర్షిప్ లు 

Satur Scholarships for poor students

Satur Scholarships for poor students

Date:21/08/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో విద్యనభ్యసించి, ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించడానికి సంతూర్ ఇచ్చే ఆర్ధిక సహాయం కోసం సెప్టెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని  విప్రో కన్స్యూమర్ కేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ ఛుగ్ కోరారు. రాష్ట్రం లో ఏ ప్రాంతానికి చెందిన వారైనా  ఉన్నత విద్యను  అభ్యసించడానికి సంతూర్ స్కాలర్షిప్స్ డాట్ కాం వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసి ఆర్ధిక సాయం పొందవచ్చినన్నారు.
విద్యార్థినులకు అండగా ఉండేలా వెనుకబడిన కుటుంబాల వారికీ  ఇచ్చే సంతూర్ స్కాలర్షిప్ ల కోసం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విప్రో కన్స్యూమర్ కేర్  సామాజిక బాధ్యత కింద 2016 లో ఈ స్కాలర్షిప్ ప్రొగ్రాము కి శ్రీకారం చుట్టిందని మూడు రాష్ట్రాల నుంచి ఏటా 900 మంది విద్యార్థులకు ఈ సహకారం అందిస్తున్నామన్నారు.
ఒక్కో విద్యార్థికి ఏటా 24 వేల రూపాయల చొప్పున మూడు సంవత్సరాలు ఈ స్కాలర్షిప్ అందిస్తున్నామని తెలిపారు. మూడు రాష్ట్రాల్లో గత 2 ఏళ్లలో 1800 యువతులు ఏ స్కాలర్షిప్ పొంది ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్టు తెలిపారు. ఇమెయిల్ లో వివరాలు పొందాలనుకునే వారుsantoor.scholarship@buddy4study.com, ఫోన్ నెంబర్ 01206834200, వెబ్ సైట్ :www.santoorscholarships.com నందు సంప్రదించాలని కోరారు.
Tags:Satur Scholarships for poor students

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *