స‌త్య‌దేవ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ `లాక్డ్‌` సీజ‌న్ 2తో ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న `ఆహా`

 

సినిమా ముచ్చట్లు:
హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం `ఆహా`లో బ్లాక్‌బ‌స్ట‌ర్ సర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్ `లాక్డ్‌` రెండో సీజ‌న్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. వైద్య‌శాస్త్రంలో క‌ఠిన‌త‌ర‌మైన ఎన్నో కేసుల‌కు ప‌రిష్కారాల‌ను సూచించిన గొప్ప న్యూరో స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ఆనంద్ పాత్ర‌లో మెప్పించ‌డానికి స‌త్య‌దేవ్ కంచ‌ర‌న మ‌రోసారి సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే అత‌ని పేరు ప్ర‌తిష్టల‌ను నాశ‌నం చేయ‌గ‌ల ఓ ర‌హ‌స్యాన్ని ఈ ప్ర‌పంచానికి తెలియ‌కుండా దాచేస్తాడు. `లాక్డ్‌` సీజ‌న్ 1ను డైరెక్ట్ చేసిన ప్ర‌దీప్ దేవ కుమార్ సీజ‌న్‌ను కూడా డైరెక్ట్ చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నున్న ఈ లాక్డ్ సీజ‌న్ 2లో ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసే అంశాలెన్నో ఉంటాయి.
`లాక్డ్‌` సీజ‌న్ 1లో చిన్న చిన్న దొంగ‌త‌నాలు చేసే ముగ్గురు దొంగ‌లు డాక్ట‌ర్ ఆనంద్ ఇంట్లోకి ప్ర‌వేశిస్తారు. అక్క‌డ వారికి ఆనంద్ జీవితంలోని చీక‌టి కోణం గురించి తెలుస్తుంది. ఆ ఇంట్లోకి ప్ర‌వేశించే ఎంతో మంది నిమిషాల్లో హ‌త‌మ‌వుతుంటారు. స‌త్య‌దేవ్‌, సంయుక్తా హెగ్డే, కేశ‌వ్ దీప‌క్‌, శ్రీల‌క్ష్మి, బిందు చంద్ర‌మౌళి త‌దిత‌రులు న‌టించిన తొలి సీజ‌న్ ప్రేక్ష‌కుల‌కు ప‌లు ట్విస్టులు, ట‌ర్న్స్‌తో ప్రేక్ష‌కులు ఓ ఉత్కంఠ‌త‌కు లోన‌య్యారు. కథ ప‌రంగా, స్కేల్‌, విజ‌న్ ప‌రంగానే కాకుండా`లాక్డ్` రెండో సీజ‌న్ వెన్నులో ఓ భ‌యాన్ని క‌లిగించేంత ఎలిమెంట్స్‌తో తెలుగు మాధ్య‌మాల్లో  మేకింగ్ స్టాండ‌ర్స్ ప‌రంగానూ స‌రికొత్త అర్థాన్ని చెప్పేలా ఉండ‌బోతుంది.

 

పుంగనూరులో భక్తిశ్రద్దలతో బక్రీద్‌ వేడుకలు

Tags:Satyadev is all set to give the audience a thrilling experience once again with the thrilling web series `Locked` Season 2 ‘Aaha’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *